బావా యాక్టర్ అవుతా అన్నాడు.. నా సపోర్ట్ నీకు ఉండదు పోయి సావు అని చెప్పేశా.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్
రామ్ నితిన్(Ram Nithin), నార్నె నితిన్(Narne Nithin), సంగీత్ శోభన్(Sangeeth Sobhan) ప్రధాన పాత్రలో వచ్చిన ‘మ్యాడ్ -2’ చిత్రం(Mad-2 Movie) ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: రామ్ నితిన్(Ram Nithin), నార్నె నితిన్(Narne Nithin), సంగీత్ శోభన్(Sangeeth Sobhan) ప్రధాన పాత్రలో వచ్చిన ‘మ్యాడ్ -2’ చిత్రం(Mad-2 Movie) ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదలైన వారంలోనే దాదాపు రూ.80 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా సక్సెట్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్(Junior NTR), దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Ssrinivas) గెస్టులుగా హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నార్నె నితిన్ గురించి మాట్లాడుతూ.. ‘నాకు 2011లో పెళ్లి అయింది. అప్పుడు నితిన్ చాలా చిన్న పిల్లవాడు. నాతో మాట్లాడటానికి చాలా భయపడేవాడు. అప్పుడు నేను అసలు మాట్లాడాల్సింది ఇతనే కదా అని అనుకునేవాడిని. అలా ఒకరోజు చాలా ధైర్యం చేసి నా దగ్గరకు వచ్చి ఎంతో కాన్ఫిడెంట్‌గా బావా.. నేను యాక్టర్ అవుతా అని అన్నాడు. అప్పుడు నేను అంతే ధైర్యంగా నా సపోర్ట్ నీకు ఉండదు పోయి చావు అన్నాను.
అయితే చెప్పడం చెప్పాను కానీ నాకు ఎప్పుడూ చిన్న భయం ఉండేది యాక్టింగ్ అంటున్నాడని, కానీ ఏ రోజు కూడా నాతో సినిమా స్క్రిప్ట్ గురించి కానీ సీన్స్ గురించి కానీ చర్చించలేదు. అయినప్పటికీ అతను ఈరోజు ఇంత మంచి స్టేజ్‌లో ఉన్నాడు. దానికి కారణం అతను మంచి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్‌తో వర్క్ చేయడమే. బెస్ట్ ఆఫ్ లక్ నితిన్ నీకు ఇంకా మంచి ఫీచర్ ఉంది, ఇంకా నీతో ఇంటికెళ్లాక మాట్లాడతాను’ అని ఇంతటితో ముగించేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.