Brahmamudi : కోడలు కోసం కొడుకు పై ఫైర్ అయినా అపర్ణా దేవి

బ్రహ్మముడి ( Brahmamudi ) ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

Update: 2024-11-28 06:54 GMT

దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ( Brahmamudi ) ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

హే కావ్య.. పుట్టింటికి పొయ్యేదానివి పోకుండా మా మమ్మీని కూడా తీసుకుని పోయావ్.. ఇక్కడేమో వంట చేసేవాళ్లు కూడా ఎవరు లేరు.. నాన్నమ్మ మా కోసం వంట చేస్తూ చేతులు కాల్చుకుంది. ఇదంతా నీ వల్లే జరిగిందంటూ కావ్యపైన రాజ్ ఓ రేంజ్లో విరుచుకుపడతాడు. కావ్యను కొంచం కూడా మాట్లాడనివ్వడు. ఇక వెంటనే ఫోన్ అపర్ణా దేవి తీసుకుని ‘ఏంటి అలా అరుస్తున్నావ్ .. ఆ అరవడం ఏంటి .. పెళ్లాం మీద పెత్తనం చేస్తున్నావ్ .. కొత్తగా ఇదెవరు నేర్పించారు. నీకు కావ్య మీద అరిచే హక్కు ఉందా.. ?’ అంటూ రాజ్‌పై గట్టిగా వాయించేస్తుంది. రాజ్ " అది కాదు మమ్మీ .. ఇది కాదు మమ్మీ అని" అంటున్నా వినదు.. కోపంతో తిడుతూనే ఉంటుంది.

'వాడి మాటలేం పట్టించుకోకు ' అని కావ్యకు చెప్పి వెళ్లిపోతుంది అపర్ణా దేవి. కానీ, కావ్య మాత్రం.. ఇలా అనుకుంటూ ఉంటుంది. మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది. ‘అయ్యో పాపం.. అమ్మమ్మా తాతయ్యా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వంట చేసేవాళ్లు లేక' అని అనుకుంటూ ఉంటుంది. ఈ సీన్ ఇక్కడితో ముగుస్తుంది.

సీన్ కట్ చేస్తే కవి.. అప్పూకి పదివేల చెక్ తీసుకొచ్చి ఆమె చేతిలో పెడుతూ.. పాటలు రాసినందుకు లక్ష్మీకాంత్ గారు ఇచ్చారని చెబుతాడు. ఆ మాటకి భార్య అప్పూ సంతోషపడి " నాకు చాలా గర్వంగా ఉంది.. మన టైమ్ వచ్చేసింది ఇక తగ్గేదేలే .. మన శత్రువు ఎక్కడో ఉందో పదా వెళ్దాం’ అంటూ కవి చేయి పట్టుకుని అనామిక ఉన్న ఇంటికి తీసుకెళ్తుంది. ‘ఏంటి అనామకురాలా మారిపోయావా లేక వేరే వాళ్ళ కొంపలో నిప్పులు పోయాలా అని చూస్తున్నావా?’ అంటూ ఫైర్ అవుతుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Tags:    

Similar News