Brahmamudi: రాజ్ కి ఝలక్ ఇచ్చిన బ్యాంక్ అధికారులు

బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

Update: 2024-12-14 09:16 GMT

దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి (Brahmamudi ) ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

కంపెనీని ప్రారంభించే ముందు మీ తాతగారు వాళ్ల స్నేహితుడిని నమ్మి వందకోట్లకు మా బ్యాంక్‌లో షూరిటీ సంతకం చేశారు. ఇప్పుడు అతను బ్యాంక్‌కు కట్టాల్సిన లోన్స్ ఏవి కట్టకుండా అందర్ని మోసం చేశాడు.. అతడు కూడా ఎక్కడా దొరకడం లేదు. ఇప్పుడు, వారి తరపున షూరిటీ ఇచ్చిన తాతయ్యగారే వాటిని మీ తాతయ్యే కట్టాలి. మీ తాతయ్యగారు ఇప్పుడు కోమాల్లో ఉన్నారు.. కాబట్టి.. ఆయన వారసుడిగా దాని బాధ్యత మీరు తీసుకుని వందకోట్లు కడతారా లేక మీ ఆస్తిని జప్తు చేయమంటారా?’ అని అధికారులు వారిని అడుగుతారు.

‘చూడండి.. ఇది వినడానికే షాకింగ్ లాగా ఉంది.. ఇప్పటికిప్పుడు అంటే ఎలా కట్టాలి .. నాకు కొంచెం సమయం కావాలి’ అని రాజ్ అంటాడు. అయితే ఈ పేపర్స్ మీద ఒక చిన్న సంతకం చేయండి. దీనికి మీరే బాధ్యులని ఒప్పుకున్నట్టు ఇక్కడ సంతకం చేస్తే మీకు పదిరోజులు వరకు టైం ఇస్తాం. లేదు.. కుదరదు అంటే బ్యాంక్ రూల్స్ ప్రకారం ఆస్తి మొత్తాన్ని జప్తు చేస్తాం’ అని బ్యాంక్ అధికారులు అంటారు. ఇక ఇలా కాదులే అనుకుని సంతకం చేయడానికి రాజ్ రెడీ అవుతాడు.. అదే సమయంలో అక్కడే ఉన్న వేరే ఉద్యోగి.. ‘సార్ ఒక్క నిమిషం ఆగండి .. బయటికి వస్తారా? నేను మీతో కొంచం మాట్లాడాలి’ అని పక్కకు తీసుకెళ్లి మాట్లాడతాడు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది. 

Tags:    

Similar News