Akkineni Akhil: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లోడింగ్.. హైప్ పెంచుతున్న అక్కినేని అఖిల్ ట్వీట్

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున(Nagarjuna) తనయుడిగా అఖిల్(Akhil) ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

Update: 2024-12-30 09:35 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున(Nagarjuna) తనయుడిగా అఖిల్(Akhil) ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అఖిల్, హలో, మజ్ను, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్(Most Eligible Bachelor), వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇక గత ఏడాది అఖిల్ ‘ఏజెంట్’(Agent) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో కొద్ది కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. మళ్లీ ఎలాంటి సినిమాను ప్రకటించకుండా సోషల్ మీడియా(Social Media)లో కూడా యాక్టివ్‌గా ఉండటం లేదు.

ఇటీవల జైనబ్‌తో నిశ్చితార్థం చేసుకుని బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేశాడు. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, అఖిల్ X ద్వారా ఓ బిగ్ గుడ్ న్యూస్ ప్రకటించాడు. ‘లెనిన్’(Lenin) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఓ పోస్టర్‌ను షేర్ చేసి హైప్ పెంచాడు.  ‘‘ఆట మొదలైంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లోడింగ్’’ అనే క్యాప్షన్ జత చేసి ఫైర్ ఎమోజీలు పెట్టాడు.

అయితే ఇందులో శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మురళీ కిశోర్ అబ్బూరు(Murali Kishore Abburu) దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sithara Entertainments) బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది చివరిలోగా థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు టాక్. ఇక అఖిల్ సినిమా ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

Tags:    

Similar News