‘అర్జున్ S/O వైజయంతి’ టీజర్ డేట్ లాక్.. హైప్ పెంచేస్తున్న ప్రీ టీజర్ వీడియో..

నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు.

Update: 2025-03-14 06:50 GMT
‘అర్జున్ S/O వైజయంతి’ టీజర్ డేట్ లాక్.. హైప్ పెంచేస్తున్న ప్రీ టీజర్ వీడియో..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాత(Producer)గా వ్యవహరిస్తూ పలు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’(Arjun S/O Vyjayanthi). ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో సాయి మంజ్రేకర్(Sai Manjrekar) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి(Vijayashanthi) కీ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ‘కాంతార’(Kanthara) ఫేమ్ అజనీష్ లోక్ నాథ్(Ajaneesh Loknath) సంగీతం అందిస్తున్నారు. అలాగే సోహెల్ ఖాన్(Sohail Khan), శ్రీకాంత్(Srikanth) కూడా నటిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఈ మూవి నుంచి టీజర్ రావడానికి డేట్ లాక్ చేసుకుంది. ఇందులో భాగంగా ఈ టీజర్ మార్చి 17న రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే ప్రీ టీజర్ వీడియో రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో కళ్యాణ్ రామ్ సముద్రం ఒడ్డున షర్ట్ మీద రక్తం మరకలతో ఓ బోట్‌లో కూర్చొని ఉన్నాడు. ప్రస్తుతం ఈ ప్రీ టీజర్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ సమ్మర్‌లో రిలీజ్ కానున్నట్లు సమాచారం.

Full View

Tags:    

Similar News