Anushka Shetty: ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనున్న అనుష్క.?. వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క(Anushka) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క(Anushka) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అయితే ప్రభాస్(Prabhas) నటించిన బాహుబలి(Bahubali మూవీతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ రేంజ్‌కు వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత నిశ్శబ్దం(Nishabdham) , భాగమతి(Bhaagamathie), సైజ్ జీరో లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. సైజ్ జీరో(Zero Size) సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈ బ్యూటీ.. గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) మూవీలో నటించింది. అయితే ఈ మూవీ అనుకున్నంత హిట్ కాలేకపోయింది. దీంతో ప్రస్తుతం సెలెక్టివ్‌గా పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతోంది. అందులో భాగంగానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 19 ఏళ్ల తర్వాత మలయాళం ఇండస్ట్రీలోకి తొలిసారి అడుగుపెట్టబోతోంది. అలాగే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఇదిలా ఉంటే.. గతంలో అనుష్క.. పెళ్లి(Marriage) చేసుకోబోతోంది అంటూ పలు పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో మారు అనుష్క శెట్టి మ్యారేజ్ చేసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకోవడానికి సిద్ధమైందట. ఇక ఇరువురు కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారట. కానీ, ఇంకా అనుష్క నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం. ఒకవేళ అనుష్క పెళ్లికి ఒప్పుకుంటే.. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ ఏడడుగులు వేయబోతోందని చెప్పవచ్చు. ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Read More: రవితేజ, అనుష్క క్యూట్ ఫొటోస్