ప్రముఖ నటి ఇంట్లో తీవ్ర విషాదం.. జన్మ ఉంటే మళ్లీ నీ కూతురుగానే పుట్టాలని కోరుకుంటున్నానంటూ ఎమోషనల్ పోస్ట్

ప్రముఖ నటి అభినయ అందరికీ సుపరిచితమే. తమిళనాడుకు చెందిన ఈ అమ్మడు పుట్టుకతోనే బధిర.

Update: 2024-09-01 02:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటి అభినయ అందరికీ సుపరిచితమే. తమిళనాడుకు చెందిన ఈ అమ్మడు పుట్టుకతోనే బధిర. మాట్లాడలేదు, వినలేదు. అయినా కూడా సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఈమె ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు‘ అనే మూవీతో ఫేమ్ సంపాదించుకున్నారు. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, నేనింతే, కింగ్, రాజుగారి గది 2 వంటి సినిమాల్లో నటించి ఇంకా పాపులారిటీ సంపాదించుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా అభినయ ఇన్‌స్టా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్‌లో “అమ్మ నువ్వు లేవనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను. మీరు ఆకస్మాత్తుగా మమ్మల్ని వదిలేసి ఈ లోకాన్ని విడిచి పోతారనుకోలేదు. తాతలానే నువ్వు కూడా ఇలా రిక్షాలోనే మరణించారు. తండ్రి, కూతురు ఇద్దరు కూడా ఇలా ఒకేలా మరణించడం ఎంత యాదృచ్చికమో కదా.. నువ్వు లేకుంటే నేను ఇంత సాధించేదాన్ని కాదు. ప్రతి విషయంలోనూ నన్ను ముందుండి నడిపించారు. ఇప్పుడు ఆ బాధ్యతను సాయి నందన్ తీసుకుంటాడు. జన్మ ఉంటే మళ్లీ నీ కూతురుగానే పుట్టాలని కోరుకుంటున్నాను అమ్మ. రెస్ట్ ఫరెవర్ అమ్మ” అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అది చూసిన ఆమె అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.

Full View

(video link credits to abhinaya official instagram id)



Similar News