స్టార్ హీరోతో ఎఫైర్.. ఎట్టకేలకు స్పందించిన సింగర్‌.. ఇది మీ సమస్య కాదంటూ సంచలన పోస్ట్

తమిళ స్టార్ హీరో జయం రవి(Jayam Ravi) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-09-26 07:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో జయం రవి(Jayam Ravi) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా 15ఏళ్ల కాపురం తర్వాత తన వైఫ్‌కు విడాకులు ఇవ్వబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విడాకులు గురించి నాకు తెలియదని తన భార్య ఆర్తి(Arti) కూడా సోషల్ మీడియాలో షాకింగ్ స్టేట్‌మెంట్ పెట్టింది. ఈ క్రమంలో తాజాగా జయం రవి తన భార్య తనను ఇంట్లో ఉండనిస్తలేదని.. ఆ ఇంట్లో ఉన్న తన వస్తువులు తనకు కావాలని పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వీరి మ్యాటర్ నెట్టింట దుమ్ము దుమారం రేపుతోంది.

అయితే జయం రవి తన భార్యతో విడాకులు తీసుకోవడానికి కారణం ఓ సింగర్ అనే ఓ పుకారు నెట్టింట షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే జయం రవి స్పందించి.. అవన్నీ పుకార్లు మాత్రమేనని, గాయనిని ఇందులోకి లాగొద్దని కోరాడు. అలాగే తాను అన్ని ఆధారాలతో కోర్టులో పరిష్కారం కోరుతున్నానని అన్నారు. ఇక తాజాగా దీనిపై సదరు సింగర్ కెనిషా ఫ్రాన్సిస్(Kenisha Francis) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది.

ఆమె మాట్లాడుతూ.. ‘ముందుగా వినయపూర్వకంగా మీకు చెబుతున్నాను. దీనికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది మీ ఇంటి సమస్య కాదు.. మరొకరిది. మీరు ఈ విషయంలో ఒక అభిప్రాయానికి అర్హులు కాదు.. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ దయగా ఉండాల్సిన అవసరం ఉందని అభ్యర్థిస్తున్నాను. ఈ విషయంపై నేను ఏ ఇతర మీడియాతో మాట్లాడను’. అని  సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈమె పోస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

(video link credits to kenishafrancis instagram id)


Similar News