Samantha: నటి సమంత ఇంట తీవ్ర విషాదం.. హార్ట్ బ్రేకింగ్ ఎమోజీతో భావోద్వేగ పోస్ట్

టాలీవుడ్‌(Tollywood)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటీ సమంత(Samantha) తండ్రి కన్నుమూశారు.

Update: 2024-11-29 11:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌(Tollywood)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి సమంత(Samantha) తండ్రి జోసెఫ్ ప్రభు(Joseph Prabhu) కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వయంగా సమంతే సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘నాన్నను ఇక కలవలేను’ అని పేర్కొంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. దీనికి హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని పెట్టారు. దీంతో సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఆమెకు సానుభూతికి తెలియజేస్తున్నారు. ధైర్యంగా ఉండాలని.. ఆమె తండ్రికి సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా, తన జీవితంలో తండ్రి కీలక పాత్ర పోషించారని సమంత పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఆమె ఎదుగుదల, జీవిత ప్రయాణంలో ఆయన అందించిన మద్దతు గురించి తరచుగా ప్రస్తావించేవారు. జోసెఫ్ ప్రభు మరణ వార్త అభిమానులు, శ్రేయోభిలాషులను విషాదంలో ముంచెత్తింది. ఈ కష్టకాలంలో సమంతాకు శ్రేయోభిలాషులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Read More : ఆయన మాటలే నన్ను బలంగా మార్చాయి.. సమంత ఎమోషనల్ కామెంట్స్



 


Tags:    

Similar News