Dokka Seethamma : గొప్ప వ్యక్తి బయోపిక్‌తో రాబోతున్న ఆమని ఫస్ట్ లుక్ రిలీజ్.. వచ్చిన మనీ అంతా ఆ రాష్ట్ర మంత్రులకే

సీనియర్ నటి ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2025-03-29 12:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నటి ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ హీరోయిన్ అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఏకంగా అగ్ర హీరోల సినిమాల్లో నటించి తన అద్భుతమైన నటనతో మెప్పించింది. ప్రస్తుతం ఆమని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమని అనేక మందికి అన్నదానం చేసి.. ఆంధ్రుల అన్నపూర్ణఅని పిలుచుకునే డొక్కా సీతమ్మ బయోపిక్‌లో అవకాశం దక్కించుకుంది.

ఇకపోతే తాజాగా ఇవాళ (మార్చి 29) ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ మూవీ అని టైటిల్ ప్రకటించి.. ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీలో ఆమని అండ్ మురళీ మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉషారాణి మూవీస్ బ్యానర్‌పై వల్లూరి రాంబాబు నిర్మాణంలో టి. వి. రవి నారాయణ్ డైరెక్షన్‌లో ఈ చత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమంలో నిర్మాత అంబికా కృష్ణ మాట్లాడారు.

డొక్కా సీతమ్మ వంటి మహనీయులు అయిన స్టోరీతో మూవీ తీయడం నిజంగా గొప్ప విషయమని చెప్పుకొచ్చారు. 400 ఎకరాలు అమ్మి.. ప్రజలకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఈమె అని కొనియాడారు. అలాగే దర్శకుడు నారాయణ్ మాట్లాడుతూ.. డొక్కా సీతమ్మ చరిత్ర అందరికీ తెలియాలని ఈ మూవీ తెరకెక్కిస్తున్నానని అన్నారు. పవర్ స్టార్ ఫ్యాన్‌గా ఒక మంచి పని చేయాలని అనుకున్నానని తెలిపారు.

కాగా పవన్ డొక్కా సీతమ్మ గురించి చెప్పిన మాటలు తనలో స్ఫూర్తిని నింపాయని వెల్లడించారు. ఈ మూవీ నుంచి వచ్చిన మనీ అంతా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు విరాళంగా ఇస్తామని ప్రకటించారు. డొక్కా సీతమ్మ పేరు మీద ఉన్న పథకానికి ఈ మనీ విరాళంగా ఇస్తామని చెప్పుకొచ్చారు. 

 

Tags:    

Similar News