Shanmukha: డివోషనల్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’ నుంచి ఆది, అవికా ఫస్ట్ లుక్ రిలీజ్

ఆది సాయి కుమార్ (Adi Sai Kumar), అవికాగోర్ (Avikagore) జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘షణ్ముఖ’

Update: 2025-02-14 10:59 GMT
Shanmukha: డివోషనల్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’ నుంచి ఆది, అవికా ఫస్ట్ లుక్ రిలీజ్
  • whatsapp icon

దిశ, సినిమా: ఆది సాయి కుమార్ (Adi Sai Kumar), అవికాగోర్ (Avikagore) జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘షణ్ముఖ’ (Shanmukha). డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాప్పాని దర్శకత్వం వహిస్తున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో ఆది సాయి కుమార్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించగా.. అతడి బ్యాక్ గ్రౌండ్‌లో రకరకాల అవతారాలతో కొందరు వ్యక్తులు ఉన్నారు. అంతే కాకుండా వారితో పాటు సుబ్రహ్మణ్య స్వామి అవతారం చూపించడం అందరిలో ఆశక్తిని రేకెత్తించింది.

ఈ క్రమంలోనే తాజాగా లవర్స్ డే స్పెషల్‌గా ఈ సినిమా నుంచి లవ్ యాంగిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే త్వరలో ఓ పాట రాబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు ‘త్వరలో చంద్రకళ పాటతో ప్రేమను సెలబ్రేట్ చేసుకోండి’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ పోస్టర్‌లో ఆది సాయి కుమార్ టీనేజ్ కుర్రాడిలాగా కనిపించగా.. అవికా గోర్ అందమైన 16 అణాలు ఆడపడుచులా మెరిసిపోతోంది. కాగా.. ఈ చిత్రానికి ‘కేజీఎఫ్, సలార్’ ఫేమ్ రవి బస్రూర్ (Ravi Basrur) మ్యూజిక్ అందిస్తుండగా.. అతడి బీజీఎమ్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంబోతుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో ‘షణ్ముఖ’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News