నీ సినిమా చూడటం కంటే బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినడం బెటర్ అంటూ నెటిజన్ ట్వీట్.. యంగ్ హీరో రియాక్షన్ ఇదే..
బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju), జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి(Deepika Pilli) జంటగా నటించిన మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi).

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju), జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి(Deepika Pilli) జంటగా నటించిన మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi). ఇక ఈ చిత్రాన్ని నితిన్(Nithin), భరత్(Bharath)లు తెరకెక్కించారు. ఇక ఇందులో సత్య(Sathya), గెటప్ శ్రీను(Getup Srinu), వెన్నెల కిశోర్(Vennela Kishore), మురళీధర్ గౌడ్(Muralidhar Goud), సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ వంటి వారు కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 11న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
ఈ క్రమంలో సోషల్ మీడియా(Social Media) వేదికగా ఓ నెటిజన్ ప్రదీప్ సినిమాపై ఓ ట్వీట్ చేశాడు. అందులో ‘ప్రదీప్ కోసం మూవీకి వెళ్దాం అనుకున్నా, కానీ ఆ రివ్యూస్ చూశాక నా డబ్బులు వేస్ట్ చేయాలనుకోవట్లేదు. మంచిగా అదే పైసలతో బిర్యానీ ఆర్డర్ చేసి నెట్‌ఫ్లిక్స్‌లో కోర్ట్ సినిమా చూసుకుందాం’ అని రాసుకొచ్చాడు. ఇక ఆ నెటిజన్ ట్వీట్‌కు ప్రదీప్ మాచిరాజు స్వీట్ రిప్లై ఇచ్చాడు. ‘ఏం పర్లేదు భయ్యా ఒకసారి ట్రై చెయ్.. సరదాగా నవ్వుకొని వచ్చేయ్.. చూశాక చెప్పు భయ్యా బిర్యాని కూడా నేనే పంపిస్తా’ అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.