సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత..

గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాలు వెంటాడుతున్నాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా దేవుడి దగ్గరకు వెళ్లి పోతున్నారు.

Update: 2025-03-21 04:25 GMT
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాలు వెంటాడుతున్నాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా దేవుడి దగ్గరకు వెళ్లి పోతున్నారు. అందులో కొంతమంది హెల్త్ ఇష్యూస్ వలన కన్నుమూస్తుంటే మరికొంతమంది సడెన్‌గా చనిపోతున్నారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

30కు పైగా కన్నడ హిట్‌ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు ఎ.టి.రఘు(AT Raghu) మనందరికీ సుపరిచితమే. ఆయన తీసిన సినిమాల్లో దాదాపు అన్నీ హిట్ సినిమాలే. కేవలం ఒక్క హీరో తోనే 20 హిట్లు ఇచ్చాడు అంటేనే రఘు సత్తా ఏమిటో తెలుస్తుంది. అలాంటి ఎ.టి రఘు ఈరోజు మనతో లేరు. ఆయన తన 76 ఏళ్ల వయసులో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా ఆయన దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ ‘న్యాయ నీతి ధర్మ’(Nyaya Neethi Dharma).

Tags:    

Similar News