వలస కార్మికులకు సీఐ సైదులు భరోసా..
దిశ,మెదక్: రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడంతో ఉపాధి కోసం వలస వచ్చిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతులో డబ్బుల్లేక, తినడానికి తిండిలేక బాధపడుతున్న వారిని చూసి చలించిపోయిన సిద్దిపేట పట్టణ వన్‌టౌన్ సీఐ సైదులు తన సొంత డబ్బులతో ఒరిస్సా, మహారాష్ట్ర , బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికులకు 100 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్, ట్రాఫిక్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది […]
దిశ,మెదక్: రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడంతో ఉపాధి కోసం వలస వచ్చిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతులో డబ్బుల్లేక, తినడానికి తిండిలేక బాధపడుతున్న వారిని చూసి చలించిపోయిన సిద్దిపేట పట్టణ వన్‌టౌన్ సీఐ సైదులు తన సొంత డబ్బులతో ఒరిస్సా, మహారాష్ట్ర , బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికులకు 100 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్, ట్రాఫిక్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
tags: corona, lockdown, necessities supply to labour, ci saidulu