లాక్‌డౌన్ ‘రూల్స్’ బ్రేక్.. ‘ఎస్ఐ’ కారుకు భారీ జరిమానా

దిశ, కుత్బుల్లాపూర్ : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల సీఐ బాలరాజు శభాష్ అనిపించుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటించకుంటే ఎవ్వరైనా సరే వదిలేదిలేదని స్పష్టం చేశారు. ఆదివారం వాహనాల తనిఖీల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఎస్సై కారు (టీఎస్ 08 హెచ్ఈ 5544) ఉదయం 11 గంటల ప్రాంతంలో షాపూర్ నగర్ నుంచి సూరారం వైపు వెళ్తుంది. అదే సమయంలో సాగర్ హోటల్ వద్ద తనిఖీలు చేస్తున్న సీఐ బాలరాజు కారును ఆపి […]

Update: 2021-05-16 04:50 GMT

దిశ, కుత్బుల్లాపూర్ : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల సీఐ బాలరాజు శభాష్ అనిపించుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటించకుంటే ఎవ్వరైనా సరే వదిలేదిలేదని స్పష్టం చేశారు. ఆదివారం వాహనాల తనిఖీల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఎస్సై కారు (టీఎస్ 08 హెచ్ఈ 5544) ఉదయం 11 గంటల ప్రాంతంలో షాపూర్ నగర్ నుంచి సూరారం వైపు వెళ్తుంది.

అదే సమయంలో సాగర్ హోటల్ వద్ద తనిఖీలు చేస్తున్న సీఐ బాలరాజు కారును ఆపి పరిశీలించాడు. పోలీస్ అని బోర్డు పెట్టుకోవడంతో ఐడీ కార్డు అడిగారు. ఇది నా కారు కాదనీ, మా బావ కారని తెలుపడంతో ఏమాత్రం ఆలోచించకుండా జరిమానా విధించారు. దీంతో జీడిమెట్ల పోలీసుల
పనితీరును స్థానికులు అభినందిస్తున్నారు.

 

Tags:    

Similar News