గేల్‌కు రెండుసార్లు నెగెటివ్ వస్తేనే జట్టుతో..

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (Kings XI Punjab) తరపున ఆడుతున్న విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌ (Gayle)కు రెండు సార్లు కరోనా (Corona) నెగెటివ్ వస్తేనే జట్టుతో చేరతాడని ఫ్రాంచైజీ యాజమాన్యం తేల్చి చెప్పింది. గతవారం గేల్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ (Usen Bolt) బర్త్ డే పార్టీకి వెళ్లాడు. ఆ తర్వాత బోల్ట్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం అతను హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. కాగా, యూఏఈ(UAE) బయలుదేరే ముందు […]

Update: 2020-08-25 07:06 GMT
గేల్‌కు రెండుసార్లు నెగెటివ్ వస్తేనే జట్టుతో..
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (Kings XI Punjab) తరపున ఆడుతున్న విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌ (Gayle)కు రెండు సార్లు కరోనా (Corona) నెగెటివ్ వస్తేనే జట్టుతో చేరతాడని ఫ్రాంచైజీ యాజమాన్యం తేల్చి చెప్పింది. గతవారం గేల్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ (Usen Bolt) బర్త్ డే పార్టీకి వెళ్లాడు. ఆ తర్వాత బోల్ట్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం అతను హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. కాగా, యూఏఈ(UAE) బయలుదేరే ముందు జమైకాలో గేల్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. అతను యూఏఈ చేరుకున్న తర్వాత ఎయిర్‌పోర్టు(Airport)లో మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. వెంటనే అతడిని హోటల్ రూం(Hotel Room)లో ఆరు రోజుల క్వారంటైన్ ‌(Quarantine‌)కు పంపనున్నారు. ఆ తర్వాత కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తారు. గేల్ చివరిసారిగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌(Bangladesh Premier League‌)లో ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ పేట్రియట్స్ జట్టుతో కలసి ఆడాల్సి ఉంది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల సీపీఎల్(CPL) నుంచి తప్పుకున్నాడు. ఇక కింగ్స్ ఎలెవెన్ జట్టుకే చెందిన కరుణ్ నాయర్(Karun Nair) కూడా జులైలో కరోనా బారిన పడి కోలుకున్నాడు. ప్రస్తుతం జట్టు యూఏఈలో రెండు వారాల ఐసోలేషన్‌(Isolation‌)లో ఉన్నది.

Tags:    

Similar News