చిట్టాపూర్ ఎంపిటిసి రఘునందన్ రావు సమక్షంలో బిజెపిలో చేరిక
దిశ, దుబ్బాక: మీ మీద, మీ అభివృద్ధి మీద నమ్మకం ఉంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడానికి గల్లీకి ఇద్దరి చొప్పున లీడర్లను తింపుతూ ప్రొసీడింగ్స్ పేరుతో అబద్ధపు ప్రచారాన్ని మానుకోవాలని మంత్రి హరీష్ రావుపై కు బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాధవనేని రఘునందనరావు ఆరోపించారు. మీకు దమ్ముంటే మీరు దుబ్బాకలో అడుగు పెట్టకుండా ఉండి, ఇంచార్జ్ నాయకులను వెనక్కి తీసుకోండి అప్పుడు ఎవరు గెలుస్తరో చూడండి అని హరీష్ రావు కు సవాల్ విసిరారు. […]
దిశ, దుబ్బాక: మీ మీద, మీ అభివృద్ధి మీద నమ్మకం ఉంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడానికి గల్లీకి ఇద్దరి చొప్పున లీడర్లను తింపుతూ ప్రొసీడింగ్స్ పేరుతో అబద్ధపు ప్రచారాన్ని మానుకోవాలని మంత్రి హరీష్ రావుపై కు బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాధవనేని రఘునందనరావు ఆరోపించారు. మీకు దమ్ముంటే మీరు దుబ్బాకలో అడుగు పెట్టకుండా ఉండి, ఇంచార్జ్ నాయకులను వెనక్కి తీసుకోండి అప్పుడు ఎవరు గెలుస్తరో చూడండి అని హరీష్ రావు కు సవాల్ విసిరారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పలు గ్రామాల్లో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాధవనేని రఘునందనరావు ఎన్నికల ప్రచారం నిర్వహణ లో భాగంగా, దుబ్బాక మండలం చిట్టాపూర్ టిఆర్ఎస్ ఎంపిటిసి సభ్యులు కనుకయ్య బిజెపి పార్టీలో చేరారు. ఎంపిటిసి కనుకయ్య తోపాటు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పోతనక దుర్గయ్య కు రఘునందన్ రావు బిజెపి కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి బ్రతికుండగానే ఎమ్మెల్యే స్వగ్రామం చిట్టాపూర్ కారు గుర్తును ఓడించి ఎంపిటిసి గా గెలుపొందారు అన్నారు. అంతేకాకుండా దుబ్బాక నియోజకవర్గంలో ఇంకా చాలా మంది ఎంపిటిసిలు, సర్పంచులు నరేంద్ర మోడీ నాయకత్వం లో పనిచేయడానికి సిద్ధమైతుంటే, మంత్రి హరీష్ రావు ప్రొసీడింగ్స్ పేరుతో ఆశ చూపించి మోసం చేస్తున్నారని విమర్శించారు. దుబ్బాక లో బిజెపి జెండా ఎగరడం ఖాయమని తెలుపుటకు చిట్టాపూర్ ఎంపిటిసి సభ్యులు కనుకయ్య నే సాక్షం అన్నారు. ఇకపై టిఆర్ఎస్ ఆటలు చెల్లవని హెచ్చరించారు. పార్టీ లో చేరిన ఎంపిటిసి కనుకయ్య మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ లో అనేక ఒత్తిడికి, అవమానానికి గురైనామని, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తే మమ్మల్ని వాడుకొని వెనక్కి తొక్కారని, అలాంటి వారికి ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రఘునందన్ రావు నాయకత్వంలో దుబ్బాక నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగురడం ఖాయం అన్నారు.