కరోనా పై పోరాటం… 22 మందితో చిత్ర పాట
కరోనా మహమ్మారి ప్రభావం మానవత్వం ఇంకా మిగిలే ఉందని చాటి చెప్తోంది. తోటి మనుషుల కష్టాలని తమ కష్టాలుగా భావిస్తూ ఎంతో మంది తమకు తోచిన సహాయం అందిస్తున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ప్రభుత్వానికి కోట్లలో సహాయాన్ని ప్రకటిస్తున్నారు. అంతే కాదు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కష్ట కాలాన్ని అధిగమించాలంటే ఏమి చేయాలో… ఏం చేయకూడదో ప్రజలకు సలహాలు ఇస్తున్నారు. సినీ ప్రముఖులు లాక్ డౌన్ లో ఉన్న అభిమానుల్లో జోష్ నింపే […]
కరోనా మహమ్మారి ప్రభావం మానవత్వం ఇంకా మిగిలే ఉందని చాటి చెప్తోంది. తోటి మనుషుల కష్టాలని తమ కష్టాలుగా భావిస్తూ ఎంతో మంది తమకు తోచిన సహాయం అందిస్తున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ప్రభుత్వానికి కోట్లలో సహాయాన్ని ప్రకటిస్తున్నారు. అంతే కాదు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కష్ట కాలాన్ని అధిగమించాలంటే ఏమి చేయాలో… ఏం చేయకూడదో ప్రజలకు సలహాలు ఇస్తున్నారు. సినీ ప్రముఖులు లాక్ డౌన్ లో ఉన్న అభిమానుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తూ… ఇళ్లు దాటి బయటికి రాకుండా జాగ్రత్తలు చెబుతున్నారు. కొందరు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వీడియోలను షేర్ చేస్తూ స్ఫూర్తి నింపుతుంటే… మరి కొందరు ప్రముఖులు తమ పాటలు, కవితల ద్వారా ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ హెచ్చరిస్తున్నారు.
ఈ క్రమంలో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్, ఎన్నో పాటలు రాగా… 22 మందితో కలిసి ఓ సాంగ్ రిలీజ్ చేశారు సింగర్ చిత్ర. ఈ పాట కోసం గాయనీ గాయకులు అందరూ… తమ తమ ఇంటి నుంచే పనిచేసినట్లు తెలిపారు. ‘లోకా సమస్తా సుఖినోభవంతు’ అంటూ సాగే ఈ పాట రిలీజ్ అయిన 24 గంటల్లోనే మూడున్నర లక్షల వ్యూస్ సంపాదించింది. కరోనా కారణంగా దెబ్బతిన్న ప్రపంచశాంతి కోరుకుంటూ ఈ పాటను రూపొంచినట్లు తెలిపారు చిత్ర.
ఈ పాటలో భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు మలయాళీ సింగర్ వి. దేవానంద్. ‘స్నేహ దీపం మిళి తురుక్కు’ చిత్రంలోని ‘లోకం మురువన్ సుఖం’ పాటను కరోనా పై అవగాహన కోసం వినియోగించామని… చిత్ర గారు చేసిన గొప్ప ప్రయత్నం అద్భుతమని ప్రశంసించారు.
Tags : K.S. Chitra, Chitra, CoronaVirus, Corona, Covid19