మెగా ట్రీట్‌కు రెడీనా?
అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం అప్‌డేట్ రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా.. ఆగస్ట్ 22న సా.4 గంటలకు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. ఎరుపు రంగు కండువాతో పిడికిలి బిగించిన చిరు ప్రీ లుక్‌ను మూవీ యూనిట్ రీవీల్ చేయగా.. బాక్సాఫీస్ వద్ద ఊచకోతే అంటున్నారు మెగా ఫ్యాన్స్. Let's […]
అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం అప్‌డేట్ రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా.. ఆగస్ట్ 22న సా.4 గంటలకు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. ఎరుపు రంగు కండువాతో పిడికిలి బిగించిన చిరు ప్రీ లుక్‌ను మూవీ యూనిట్ రీవీల్ చేయగా.. బాక్సాఫీస్ వద్ద ఊచకోతే అంటున్నారు మెగా ఫ్యాన్స్.
Let's Assemble for #Chiru152 on AUG 22nd at 4 PM ✊🏽#Megastar @KChiruTweets @sivakoratala #ManiSharma @DOP_Tirru #NavinNooli @sureshsrajan @AlwaysRamCharan #NiranjanReddy @KonidelaPro pic.twitter.com/NsEIj1hY5X
— Matinee Entertainment (@MatineeEnt) August 18, 2020
కాగా, చిరు 152కు ‘ఆచార్య’ పేరును ఓ సినిమా కార్యక్రమంలో ఇప్పటికే చిరు అనుకోకుండా అనౌన్స్ చేయగా.. ఫ్యాన్స్ అదే ఫిక్స్ అయ్యారు. కానీ ఆ టైటిల్ మారుతుందా? లేదా? సినిమాలో చిరు లుక్ ఎలా ఉండబోతుందని చర్చిస్తున్నారు ఫ్యాన్స్. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్.. కీ రోల్ ప్లే చేస్తుండగా, కాజల్ అగర్వాల్ మరోసారి చిరుతో జోడీ కట్టబోతుంది.