కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్

దిశ, సినిమా: కరోనా సెకండ్ వేవ్‌లో ఆస్పత్రుల్లో సరిపడా ఆక్సిజన్ అందుబాటులో లేక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఎంతో మంది సెలబ్రిటీలు సాయం చేసేందుకు ముందుకు రాగా, మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకు ఒక ఆక్సిజన్ బ్యాంకును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ పేరుతో ట్విట్టర్ అకౌంటును కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా విపత్కర సమయంలో చిరంజీవి చేస్తున్న సేవల పట్ల కేంద్ర మంత్రి […]

Update: 2021-06-13 08:40 GMT

దిశ, సినిమా: కరోనా సెకండ్ వేవ్‌లో ఆస్పత్రుల్లో సరిపడా ఆక్సిజన్ అందుబాటులో లేక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఎంతో మంది సెలబ్రిటీలు సాయం చేసేందుకు ముందుకు రాగా, మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకు ఒక ఆక్సిజన్ బ్యాంకును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ పేరుతో ట్విట్టర్ అకౌంటును కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా విపత్కర సమయంలో చిరంజీవి చేస్తున్న సేవల పట్ల కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. మనుషుల ప్రాణాలను రక్షించడం మానవత్వాన్ని ప్రతిబింబించే గొప్ప సేవ అని కొనియాడారు. పాండమిక్ సమయంలో టాలీవుడ్ స్టార్ & మాజీ మంత్రి చిరంజీవి, తన టీమ్ చేస్తున్న నిస్వార్థ సేవలను చూస్తుంటే మనసు ఉప్పొంగుతోందని, ఈ ప్రయత్నం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతోందని ప్రశంసించారు. కాగా కిషన్ రెడ్డి పొగడ్తలకు స్పందించిన చిరు.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఆపత్కాలంలో నా తరఫున చిన్న సాయం చేస్తున్నానని వెల్లడించారు.

Tags:    

Similar News