ఆమె నా తల్లి కాదు.. కానీ మనసున్న ప్రతీ తల్లి అమ్మే కదా!
దిశ, వెబ్‌డెస్క్: సమాజ సేవలో మెగాస్టార్ తల్లి అంజనాదేవి అంటూ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కరోనాపై పోరులో అంజనాదేవి నేను సైతం అంటూ ముందుకొచ్చారని… ఇంట్లోనే స్నేహితురాళ్లతో మాస్క్‌లు కుడుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు చిరు. మా అమ్మ ఇలాంటి మానవతాదృక్పథమున్న పని చేస్తోందని మీడియాలో న్యూస్ వచ్చింది. కానీ ఆమె నా తల్లి కాదని వినయపూర్వకంగా స్పష్టం చేస్తున్నట్లు చెప్పారు. ఆమె మా అమ్మ కాకపోయినా సరే … […]
దిశ, వెబ్‌డెస్క్: సమాజ సేవలో మెగాస్టార్ తల్లి అంజనాదేవి అంటూ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కరోనాపై పోరులో అంజనాదేవి నేను సైతం అంటూ ముందుకొచ్చారని… ఇంట్లోనే స్నేహితురాళ్లతో మాస్క్‌లు కుడుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు చిరు. మా అమ్మ ఇలాంటి మానవతాదృక్పథమున్న పని చేస్తోందని మీడియాలో న్యూస్ వచ్చింది. కానీ ఆమె నా తల్లి కాదని వినయపూర్వకంగా స్పష్టం చేస్తున్నట్లు చెప్పారు. ఆమె మా అమ్మ కాకపోయినా సరే … ఇలాంటి గొప్ప పనిలో నిమగ్నమైన ఆ తల్లి దయాదాక్షిణ్యాలకు దన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. కమ్మననైన మనసున్న ప్రతీ తల్లి అమ్మే కదా అన్నారు చిరు.
It is reported in press & some media channels that my mother is doing this humanitarian work. I humbly seek to clarify that it is not my mother but whichever mother is engaged in this great act of compassion I heartily thank her for such kindness.కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే pic.twitter.com/svN4RduRUg
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 11, 2020
కాగా కరోనా క్రైసిస్ చారిటీ సంస్థను నెలకొల్పి సినీ కార్మికులకు అండగా నిలుస్తున్నారు చిరు. కరోనా విపత్కర పరిస్థితులు తొలిగిపోయే వరకు పేదలకు అండగా ఉండేందుకు హామీ ఇచ్చారు. ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములైన ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలిపిన చిరు… సరుకులను పేదల ఇంటికే చేర్చి ఆకలి తీరుస్తున్నారు.
Tags: Chiranjeevi, Tollywood, AnjanaDevi, CoronaVirus, Mask India, Covid 19