కరోనా కలకలం.. చైనాలో మళ్లీ లాక్‌డౌన్ షురూ
దిశ, వెబ్‌డెస్క్ : ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. రోజురోజుకు క్రమంగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కొన్ని దేశాలు లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా చైనాలోని జియాన్నగరంలో కొవిడ్‌కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆ నగరంలో కఠిన లాక్‌డౌన్ విధించినట్టు ఆ దేశ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. జియాన్‌లో ఒక్కరోజే అక్కడ 50కిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలోని ప్రజలు ఇళ్లనుంచి బయటకు […]
దిశ, వెబ్‌డెస్క్ : ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. రోజురోజుకు క్రమంగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కొన్ని దేశాలు లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా చైనాలోని జియాన్నగరంలో కొవిడ్‌కేసులు పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో.. ఆ నగరంలో కఠిన లాక్‌డౌన్ విధించినట్టు ఆ దేశ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. జియాన్‌లో ఒక్కరోజే అక్కడ 50కిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలోని ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ప్రయాణాలపైన కూడా ఆంక్షలు విధించారు.
ఇదిలా ఉండగా మరో రెండు నెలల్లో చైనాలో వింటర్ ఒలంపిక్స్ జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడ లాక్‌డౌన్ విధించడంతో ఒలంపిక్స్ నిర్వహణపై టెన్షన్ నెలకొంది.