ప్రజలను కాపాడాలని ప్రార్థించా : చిన జీయర్ స్వామి
దిశ, వెబ్‌డెస్క్: శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి గురువారం సాయంత్రం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, మంత్రి వేణుగోపాల కృష్ణ, ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు సాంప్రదాయంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ధ్వజస్తంభానికి నామస్కరించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని శ్రీకృష్ణస్వామి, శ్రీ సుందరరాజస్వామివారిని దర్శించుకున్నారు. చైర్మన్, ఈవో చిన్న జీయర్ స్వామికి తీర్థ […]
దిశ, వెబ్‌డెస్క్: శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి గురువారం సాయంత్రం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, మంత్రి వేణుగోపాల కృష్ణ, ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు సాంప్రదాయంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ధ్వజస్తంభానికి నామస్కరించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని శ్రీకృష్ణస్వామి, శ్రీ సుందరరాజస్వామివారిని దర్శించుకున్నారు. చైర్మన్, ఈవో చిన్న జీయర్ స్వామికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ… ప్రజల్లో విచ్చల విడితనం పోయి, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బయట ఎక్కడికి వెళ్లినా కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు. తగ్గి పోయిందనుకున్న కరోనా వ్యాధి మళ్ళీ ప్రభలుతోందనే ఆందోళన ప్రారంభమైందని, ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, పరిశుభ్రతతో క్రమశిక్షణగా మసలు కోవాలన్నారు. ఈ విపత్కర పరిస్థితి నుండి ప్రజలను కాపాడాలని అమ్మవారిని ప్రార్థించానన్నారు.