ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చైనా రాయబారి లేఖ
కరోనాపై పోరాటానికి ప్రధాని మోడీ పిలుపు మేరకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ నెల 5న ధూల్ పేటలో జ్యోతి వెలిగించి ‘చైనీస్ వైరస్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం స్పందించింది. భారత్‌లోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కౌన్సిలర్ లియూ బింగ్ రాజాసింగ్‌కు లేఖ రాశారు. కరోనా వైరస్ గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేసిన తొలి దేశం చైనా. అంతేకాని చైనాలో […]
కరోనాపై పోరాటానికి ప్రధాని మోడీ పిలుపు మేరకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ నెల 5న ధూల్ పేటలో జ్యోతి వెలిగించి ‘చైనీస్ వైరస్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం స్పందించింది. భారత్‌లోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కౌన్సిలర్ లియూ బింగ్ రాజాసింగ్‌కు లేఖ రాశారు. కరోనా వైరస్ గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేసిన తొలి దేశం చైనా. అంతేకాని చైనాలో వైరస్ పుట్టిందని కాదు. చైనీస్ వైరస్ గో బ్యాక్ అని మీరు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.’ అంటూ లేఖలో పేర్కొన్నారు. దీనిపై రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చైనీస్ వైరస్ అన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరీ ఆయనకు లేఖ రాస్తారా అంటూ ప్రశ్నించారు.
Tags: mla raja singh, china embassy, corona