ఏ కన్న తల్లి బిడ్డో.. ఎంత కష్టం వచ్చే!
దిశ, ఏపీ బ్యూరో: కళ్ల ముందు ఎందరో వెళుతున్నా అమ్మానాన్నలు కనిపించలేదు. తానెందుకు ఇక్కడ ఉన్నానో అర్థంకాని పసితనం. ఏడాదిన్నర బాలిక. ఎవరికి ఏ కష్టమొచ్చిందో.. మాయదారి కాలం పాపను రుయా ఆస్పత్రి సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఒంటరిని చేసింది. అలిపిరి ఎస్‌ఐ షేక్‌షావల్లీ కథనం మేరకు.. తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల – రుయా ఆస్పత్రి మధ్య ఫుట్‌పాత్‌పై ఏడాదిన్నర బాలిక ఒంటరిగా ఉన్నట్లు బుధవారం సాయంత్రం సమాచారం వచ్చింది. అక్కడికెళ్లి చూడగా ఒంటరిగా ఓ పాప […]
దిశ, ఏపీ బ్యూరో: కళ్ల ముందు ఎందరో వెళుతున్నా అమ్మానాన్నలు కనిపించలేదు. తానెందుకు ఇక్కడ ఉన్నానో అర్థంకాని పసితనం. ఏడాదిన్నర బాలిక. ఎవరికి ఏ కష్టమొచ్చిందో.. మాయదారి కాలం పాపను రుయా ఆస్పత్రి సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఒంటరిని చేసింది.
అలిపిరి ఎస్‌ఐ షేక్‌షావల్లీ కథనం మేరకు.. తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల – రుయా ఆస్పత్రి మధ్య ఫుట్‌పాత్‌పై ఏడాదిన్నర బాలిక ఒంటరిగా ఉన్నట్లు బుధవారం సాయంత్రం సమాచారం వచ్చింది. అక్కడికెళ్లి చూడగా ఒంటరిగా ఓ పాప ఉంది. అమ్మానాన్న ఎక్కడని అడిగినా పెద్దగా స్పందించలేదు. అప్పటికే స్థానికులు నీళ్ల సీసా, బిస్కెట్లు అందించారు. శిశు సంక్షేమ శాఖకు తెలియజేయగా కరోనా పరీక్షలు నిర్వహించి అనంతరం చైల్డ్ హోమ్‌కి తరలిస్తామని చెప్పారు.