ఎగ్స్ ట్రే కంపెనీల్లో మగ్గిపోతున్న బాల్యం.. నిర్లక్ష్యంగా లేబర్ ఆఫీసర్స్..!

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామచంద్రాపురం గ్రామంలోని ఎగ్స్ ట్రే కంపెనీ నిబంధనలు తుంగలో తొక్కి రాజ్యమేలుతోంది. తెలిసి.. తెలియని బాల్యంతో ఎగ్స్ ట్రే వ్యాపారం చేయిస్తోంది. పాఠశాలలో చదువుకోవాల్సిన వయసు కంపెనీల్లో మగ్గుతోంది. బ్యాగులు, పుస్తకాలు, పెన్నులు పట్టుకోవాల్సిన చేతులు ఆయుధాలు పట్టుకుంటున్నాయి. అమ్మనాన్న ఎదుట అల్లారు ముద్దుగా పెరగాల్సిన వయసులో యాజమాన్య భారం భరిస్తూ కష్టం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇతర రాష్ట్రాల నుంచి చిన్నారులను కొత్తగూడెం జిల్లాకు తరలించి, […]

Update: 2021-12-07 04:05 GMT

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామచంద్రాపురం గ్రామంలోని ఎగ్స్ ట్రే కంపెనీ నిబంధనలు తుంగలో తొక్కి రాజ్యమేలుతోంది. తెలిసి.. తెలియని బాల్యంతో ఎగ్స్ ట్రే వ్యాపారం చేయిస్తోంది. పాఠశాలలో చదువుకోవాల్సిన వయసు కంపెనీల్లో మగ్గుతోంది. బ్యాగులు, పుస్తకాలు, పెన్నులు పట్టుకోవాల్సిన చేతులు ఆయుధాలు పట్టుకుంటున్నాయి. అమ్మనాన్న ఎదుట అల్లారు ముద్దుగా పెరగాల్సిన వయసులో యాజమాన్య భారం భరిస్తూ కష్టం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇతర రాష్ట్రాల నుంచి చిన్నారులను కొత్తగూడెం జిల్లాకు తరలించి, వారితో ఇష్టారాజ్యంగా వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. బాల కార్మిక వ్యవస్థను అరికట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

ఎగ్స్ ట్రే తయారీ కంపెనీ యాజమాన్యం మైనర్లతో పనిచేయించుకున్నా, కనీసం మెడికల్ ఫెసిలిటీలు, ఇన్సూరెన్సు సౌకర్యాలు కల్పించకుండా పనిచేయిస్తున్నారు. కంపెనీల్లో తగలరాని దెబ్బ ఏదైనా తగిలితే యాజమాన్యం కనీసం ఆసుపత్రి మందులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. వారికి ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిది అనేదే ప్రశ్నార్థకంగా మారింది. అంతేగాకుండా.. పిల్లలతో ఎక్కువగా పనిచేయిస్తూ.. జీతం తక్కువగా ఇస్తూ నడ్డీ విరుస్తున్నట్లు సమాచారం. పిల్లలతో పనిచేయించుకుంటూ కోట్లు సంపాదిస్తోన్న యాజమాన్యం, వారికి కనీస వేతనం కూడా ఇవ్వడం లేదు.

లేబర్ ఆఫీసర్ కనుసన్నల్లోనే తతంగం?

ఎగ్స్ ట్రే కంపెనీ యాజమాన్యం పక్కరాష్ట్రాల నుంచి మైనర్లను కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గానికి తీసుకొచ్చి వెట్టిచాకిరీ చేయిస్తున్నా.. లేబర్ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో యాజమాన్యంతో లేబర్ ఆఫీసర్లు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. యాజమాన్యం ఇచ్చే కాసులకు కక్కుర్తిపడే చూసిచూడనట్లు ఉంటున్నారని సమాచారం. యాజమాన్యంతో పాటు నిర్లక్ష్యంగా ఉంటోన్న లేబర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు కోరుతున్నారు.

Tags:    

Similar News