రంజోల్ రైతుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్..

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన వ్యవసాయ పద్ధతులను ఎక్కువగా ప్రోత్సహిస్తారు. ఎవరైనా వినూత్నంగా సాగు చేసినా.. వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధించినా స్వయంగా వారికి ఫోన్ చేసిన ఆరా తీసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇటీవలే ఏపీకి చెందిన ఓ ఆదర్శ రైతుకు ఫోన్ చేసి వ్యవసాయంలో వేద సాగు విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. తాజాగా శనివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండంలోని రంజోల్ రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఈ […]

Update: 2021-01-02 08:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన వ్యవసాయ పద్ధతులను ఎక్కువగా ప్రోత్సహిస్తారు. ఎవరైనా వినూత్నంగా సాగు చేసినా.. వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధించినా స్వయంగా వారికి ఫోన్ చేసిన ఆరా తీసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇటీవలే ఏపీకి చెందిన ఓ ఆదర్శ రైతుకు ఫోన్ చేసి వ్యవసాయంలో వేద సాగు విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. తాజాగా శనివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండంలోని రంజోల్ రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా సదరు రైతు సాగు చేస్తున్న విధానాల గురించి ఆరా తీశారు. ఆలుగడ్డ సాగు, విత్తన రకాల గురించి తెలుసుకున్నారు. అలాగే ఆ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకువస్తారని, దిగుబడి ఎంత వస్తుందనే అంశాలపై నాగిరెడ్డిని ఆరా తీశారు. త్వరలోనే జహీరాబాద్‌లో పర్యటిస్తానని, రైతును కలుస్తానని సీఎం చెప్పారు. ఈ విషయాన్ని రైతు నాగిరెడ్డి వెల్లడించాడు. సీఎంతో ఫోన్ సంభాషణ తాలూకు ఆడియోను మీడియాకు విడుదల చేశాడు.

Tags:    

Similar News