వింత లక్షణాలతో కోళ్లు మృతి
దిశ, నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ జిల్లాలో వింత లక్షణాలతో కోళ్లు మృత్యువాత పడ్డాయి. జిల్లాలోని డిచ్‌పల్లి మండలం యానంపల్లి తండాలో దుర్గాభవాని బాయిలర్ పౌల్ట్రీఫామ్‌లో దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు కోళ్లు చనిపోయాయి. విషయం తెలుసుకుని జిల్లా పశు వైద్యాధికారి భరత్, జిల్లా వ్యాధి నిర్ధారణ అధికారి కిరణ్ దేశ్ పాండేలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…కోళ్ల రక్తనమూనాలు సేకరించి హైద్రాబాద్ ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు. పౌల్ట్రీ […]
దిశ, నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ జిల్లాలో వింత లక్షణాలతో కోళ్లు మృత్యువాత పడ్డాయి. జిల్లాలోని డిచ్‌పల్లి మండలం యానంపల్లి తండాలో దుర్గాభవాని బాయిలర్ పౌల్ట్రీఫామ్‌లో దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు కోళ్లు చనిపోయాయి. విషయం తెలుసుకుని జిల్లా పశు వైద్యాధికారి భరత్, జిల్లా వ్యాధి నిర్ధారణ అధికారి కిరణ్ దేశ్ పాండేలు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…కోళ్ల రక్తనమూనాలు సేకరించి హైద్రాబాద్ ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు. పౌల్ట్రీ ఫామ్‌లో చనిపోయిన కోళ్లకు బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవన్నారు. భయపడాల్సిన అవసరం లేదనీ.. ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి టెస్ట్‌ల ఫలితాలు వచ్చాక కోళ్లు పెద్ద మొత్తంలో ఎందుకు మృత్యువాత పడ్డాయనే విషయాన్ని వెల్లడిస్తామని చెప్పారు.