‘దళితబంధు’పై బాల్కసుమన్ కీలక వ్యాఖ్యలు.. బండికి సవాల్..?

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన దళితబంధుపై ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మె్ల్యే బాల్కసుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని దళితుల బాగుకోసం కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని బీజేపీ అడ్డుకుంటుందని బాల్క సుమన్ మండిపడ్డారు. దళితులకు వ్యతిరేకంగా బీజేపీ మూల సిద్ధాంతం ఉందన్నారు. నిజంగా దళితులపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి రూ.50 వేల కోట్లు తీసుకురావాలని సవాల్ విసిరారు. దళిత సాధికారిత కోసం బడ్జెట్‌లో రూ. వెయ్యి కోట్లు […]

Update: 2021-08-06 06:08 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన దళితబంధుపై ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మె్ల్యే బాల్కసుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని దళితుల బాగుకోసం కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని బీజేపీ అడ్డుకుంటుందని బాల్క సుమన్ మండిపడ్డారు. దళితులకు వ్యతిరేకంగా బీజేపీ మూల సిద్ధాంతం ఉందన్నారు.

నిజంగా దళితులపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి రూ.50 వేల కోట్లు తీసుకురావాలని సవాల్ విసిరారు. దళిత సాధికారిత కోసం బడ్జెట్‌లో రూ. వెయ్యి కోట్లు కేటాయించిన ఘటన టీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. దళిత బంధు ఉపఎన్నికల కోసం తెచ్చినది కాదని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News