చెన్నై ముందు 179 పరుగులు
దిశ, వెబ్‌డెస్క్: టాస్‌గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. బ్యాట్స్‌మెన్లు బాల్ టు బాల్ రన్ తీస్తునే సమయం చూసి బౌండరీలు కొట్టారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్-మయాంగ్ అగర్వాల్ క్రీజులో ఉన్నంత సేపు స్కోరు పర్వాలేదనిపించింది. తొలి వికెట్ (మయాంక్ అగర్వాల్ 26) కోల్పోయే సరికి పంజాబ్ స్కోరు 61గా ఉంది. ఓపెనింగ్ నుంచే క్రీజులో ఉన్న రాహుల్ తన బ్యాటింగ్ కొనసాగించాడు. […]
దిశ, వెబ్‌డెస్క్: టాస్‌గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. బ్యాట్స్‌మెన్లు బాల్ టు బాల్ రన్ తీస్తునే సమయం చూసి బౌండరీలు కొట్టారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్-మయాంగ్ అగర్వాల్ క్రీజులో ఉన్నంత సేపు స్కోరు పర్వాలేదనిపించింది. తొలి వికెట్ (మయాంక్ అగర్వాల్ 26) కోల్పోయే సరికి పంజాబ్ స్కోరు 61గా ఉంది.
ఓపెనింగ్ నుంచే క్రీజులో ఉన్న రాహుల్ తన బ్యాటింగ్ కొనసాగించాడు. అతడికి తోడు మందీప్ సింగ్ 16 బంతుల్లో 27 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివరకి జడేజా వేసిన బంతికి అంబటి రాయుడికి క్యాచ్ ఇచ్చి 94 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఇక కేఎల్ రాహుల్‌కు మిడిలార్డర్‌లో వచ్చిన నికోలస్ పూరన్ మంచి భాగస్వామ్యం ఇచ్చాడు. 17 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సర్లతో 33 పరుగులు చేశాడు. తొలి 17 ఓవర్లు ముగిసే సరికి కేఎల్ రాహుల్ 63, పూరన్ 33 క్రీజులో నిలబడ్డారు.
కానీ, చెన్నై బౌలర్ ఠాకూర్ అద్భుత బౌలింగ్ వేసి వెంట వెంటనే పూరన్, రాహుల్‌ను 18వ ఓవర్‌లో పెవిలియన్ పంపాడు. వరుసగా రెండు వికెట్లు తీశాడు. మొదటి బంతికి పూరన్ అవుట్ అవ్వగా.. రెండవ బంతికి రాహుల్ సైతం పెవిలియన్ పంపాడు. మొత్తం 52 బంతులు ఫేస్ చేసిన పంజాబ్ కెప్టెన్ 7 ఫోర్లు ఒక సిక్సర్‌తో 63 పరుగులు చేశాడు. దీంతో 152 పరుగుల వద్ద పంజాబ్ 4 వికెట్లను కోల్పోయింది.
ఇక ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన మ్యాక్స్‌వెల్ (11), సర్ఫరాజ్ ఖాన్ (14) పరుగులు చేయడంతో పంజాబ్ ఎలెవన్ కింగ్స్ స్కోరు 178కి చేరింది. ఇందులోనే 4 ఎక్స్‌ట్రా రన్స్ వచ్చాయి. ఇక 179 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై బ్యాటింగ్ ఎలా ఆడుతుందో వేచిచూద్దాం.