‘ఈశాన్య రాష్ట్రాల్లో హింస.. మోడీ, అమిత్ షా ఏం చేస్తున్నారు’

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ చెబుతోంది. ముఖ్యంగా బీజేపీ-ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో అల్లకల్లోలంగా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా పేర్కొన్నారు. ప్రధాని మోడీ కనుసన్నల్లోనే పూర్తి లా అండ్ ఆర్డర్‌ను విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. పలు రాష్ట్రాల్లో యుద్ధ పూరితమైన భయానక వాతవరణం నెలకొన్నప్పుడు, మోడీ అమిత్ షాలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మేఘాలయ గవర్నర్ వాహనంపై నిరసనకారులు దాడి చేసినప్పుడు  ఎందుకు స్పందించట్లేదన్నారు. అస్సాం-మిజోరాంలో సరిహద్దు […]

Update: 2021-08-18 06:38 GMT

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ చెబుతోంది. ముఖ్యంగా బీజేపీ-ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో అల్లకల్లోలంగా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా పేర్కొన్నారు. ప్రధాని మోడీ కనుసన్నల్లోనే పూర్తి లా అండ్ ఆర్డర్‌ను విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. పలు రాష్ట్రాల్లో యుద్ధ పూరితమైన భయానక వాతవరణం నెలకొన్నప్పుడు, మోడీ అమిత్ షాలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మేఘాలయ గవర్నర్ వాహనంపై నిరసనకారులు దాడి చేసినప్పుడు ఎందుకు స్పందించట్లేదన్నారు. అస్సాం-మిజోరాంలో సరిహద్దు వివాదం తీవ్రమైంది. దాదాపు ఏడుగురు పోలీసులు చనిపోయారు. తీవ్రవాదులు వీధుల్లో హింసాత్మక రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేఘాలయ హోంమంత్రి రాజీనామా చేశారు. చైనా అరుణాచల్ ప్రదేశ్ లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది’ అని ప్రశ్నించారు.

Tags:    

Similar News