మెట్రో రైళ్లలో మార్పులు.. చివరి రైలు బయల్దేరేది ఎప్పుడంటే..?
దిశ, వెబ్‌డెస్క్: కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. తెలంగాణాలో లాక్ డౌన్ పొడిగింపు కారణంగా హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో మరోసారి మార్పులు చేశారు. ఇంతకు ముందు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు సడలింపు ఇచ్చినప్పుడు అందుకు తగ్గట్టే మెట్రో రైళ్లు నడిచాయి. తాజాగా సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించడం జరిగింది. అంతేకాకుండా […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. తెలంగాణాలో లాక్ డౌన్ పొడిగింపు కారణంగా హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో మరోసారి మార్పులు చేశారు. ఇంతకు ముందు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు సడలింపు ఇచ్చినప్పుడు అందుకు తగ్గట్టే మెట్రో రైళ్లు నడిచాయి. తాజాగా సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించడం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగస్తులు ఇళ్లకు చేరేందుకు మరో గంట అదనంగా సమయం ఇచ్చింది. దీంతో మెట్రో రైళ్లలో మార్పులు చేశారు. ఇక జూన్ 10 నుండి ఉదయం 7 గంటల నుండి నడవనున్న రైళ్లు సాయంత్రం 5 గంటల వరకు వాటి సర్వీస్ ని అందించనున్నాయి. చివరి మెట్రో సర్వీస్ 5 గంటలకు బయల్దేరి 6 గంటలకు స్టేషన్ కి చేరుకోనుంది. దీంతో ఉద్యోగాలకు వెళ్లేవారికి కొంత వెసులుబాటు ఉండనుంది.