హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం లాక్ డౌన్ వేళల్లో సడలింపులు చేయడంతో హైదరాబాద్ మెట్రో సమయాల్లోనూ ఆ మేరకు మార్పులు చేశారు. ఇప్పటి వరకు ఉదయం 10 గంటలలోపే మెట్రో సేవలు పూర్తిగా నిలిపివేస్తుండగా.. ఇప్పడు ఆ సమయాన్ని మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పొడగించారు. హైదరాబాద్ మెట్రో మార్చిన షెడ్యూల్ ప్రకారం.. మెట్రో మొదటి ట్రైన్ ప్రతీ రోజూ ఉదయం ఏడు గంటలకు బయలుదేరుతుంది. ఆఖరి ట్రైన్ ఉదయం 11.45 గంటలకు […]

Update: 2021-05-30 10:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం లాక్ డౌన్ వేళల్లో సడలింపులు చేయడంతో హైదరాబాద్ మెట్రో సమయాల్లోనూ ఆ మేరకు మార్పులు చేశారు. ఇప్పటి వరకు ఉదయం 10 గంటలలోపే మెట్రో సేవలు పూర్తిగా నిలిపివేస్తుండగా.. ఇప్పడు ఆ సమయాన్ని మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పొడగించారు. హైదరాబాద్ మెట్రో మార్చిన షెడ్యూల్ ప్రకారం.. మెట్రో మొదటి ట్రైన్ ప్రతీ రోజూ ఉదయం ఏడు గంటలకు బయలుదేరుతుంది. ఆఖరి ట్రైన్ ఉదయం 11.45 గంటలకు బయలు దేరుతుండగా.. చివరి గమ్యస్థానంలోని మెట్రో స్టేషన్ కు 12.45 గంటలకు చేరుకుంటుంది. అక్కడితో ఆ రోజుకు మెట్రో సర్వీసులను ముగిస్తారు.

Tags:    

Similar News