జగన్‌కు చంద్రబాబు లేఖ

కరోనావైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో.. విదేశాల నుంచి ఏపీకి ఎంతమంది వచ్చారనే అంశంలో లెక్కల్లో తేడాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు లేఖ రాశారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించి వైద్య పరిశీలనలో ఉంచాలని చంద్రబాబు జగన్‌ను కోరారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 329 మందికి మాత్రమే కరోనా పరీక్షలు జరిగాయని చంద్రబాబు అన్నారు. కరోనా పరీక్షలు పెరగాల్సిన అవసరం ఉందని […]

Update: 2020-03-28 19:53 GMT

కరోనావైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో.. విదేశాల నుంచి ఏపీకి ఎంతమంది వచ్చారనే అంశంలో లెక్కల్లో తేడాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు లేఖ రాశారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించి వైద్య పరిశీలనలో ఉంచాలని చంద్రబాబు జగన్‌ను కోరారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 329 మందికి మాత్రమే కరోనా పరీక్షలు జరిగాయని చంద్రబాబు అన్నారు. కరోనా పరీక్షలు పెరగాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అలాగే, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వారికి రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని చంద్రబాబు రాసిన లేఖలో సీఎం జగన్‌ను కోరారు. కేంద్రం కూడా ఇప్పటికే రూ.1,70,000 కోట్లతో ప్యాకేజీ ప్రకటించిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధిత వర్గాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం మరింత ప్రభావంతంగా పనిచేయడానికి ఆర్టీజీ (రియల్ టైమ్ గవర్నెన్స్. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వ్యవస్థ) లాంటి వ్యవస్థలను ఉపయోగించుకోవాలని చంద్రబాబు కోరారు.

Tags:    

Similar News