శభాష్.. నేనున్నా..: చంద్రబాబు మెచ్చుకోలు
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కార్యకర్తకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా కాల్ చేశాడు. నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. పోలీసుల బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా నీ హక్కును, స్వేచ్ఛను కాపాడుకున్నావని ప్రశంసించారు. పూర్తి వివరాళ్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన పోలీసులు ఇలా చేయడం సరికాదని హెచ్చరించారు. దీనికి బదులుగా స్పందించిన శ్రీకాంత్ రెడ్డి వారికి దీటుగా జవాబిచ్చాడు. చట్ట […]
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కార్యకర్తకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా కాల్ చేశాడు. నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. పోలీసుల బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా నీ హక్కును, స్వేచ్ఛను కాపాడుకున్నావని ప్రశంసించారు. పూర్తి వివరాళ్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన పోలీసులు ఇలా చేయడం సరికాదని హెచ్చరించారు. దీనికి బదులుగా స్పందించిన శ్రీకాంత్ రెడ్డి వారికి దీటుగా జవాబిచ్చాడు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే దానికి తాను సిద్దంగా ఉన్నట్లు తేల్చి చెప్పాడు. ఈ వ్యవహారం మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వ్యవహారంపై స్పందించిన చంద్రబాబు శ్రీకాంత్ రెడ్డికి కాల్ చేసి ధైర్యం చెప్పారు. పోలీసులు రాజకీయ వ్యవస్థకు అనుగుణంగా ఉండటం సరికాదన్నారు. రాజకీయ ప్రయోజనాల్లో పోలీసుల హస్తం తగదని మండిపడ్డారు. తప్పు లేకపోతే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఏపీలో భారత రాజ్యాంగానికి బదులు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. అటువంటిది.. ఓ పౌరుడిగా భారత రాజ్యాంగ ఉనికి చాటారని టీడీపీ కార్యకర్తను చంద్రబాబు ప్రశసించారు. అయితే, ఓ కార్యకర్తకు పార్టీ అధినేత కాల్ చేసి మాట్లాడడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.