8 నుంచి బాబు.. 14న జగన్

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తవ్వగా.. కీలకమైన పోలింగ్ ప్రక్రియకు టైమ్ దగ్గర పడుతోంది. దీంతో పార్టీలన్నీ ప్రచార జోరును పెంచేశాయి. విస్తృతంగా తిరుపతి లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నాయి. తిరుపతి పార్లమెంట్ స్థానం చాలా కీలకమైనది కావడంతో.. పార్టీలన్నీ గెలుపు దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటివరకు పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించగా… పార్టీ అధినేతలు ఇప్పటివరకు ప్రచారంలోకి దిగలేదు. త్వరలో ఏపీ సీఎం వైఎస్ […]

Update: 2021-04-07 00:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తవ్వగా.. కీలకమైన పోలింగ్ ప్రక్రియకు టైమ్ దగ్గర పడుతోంది. దీంతో పార్టీలన్నీ ప్రచార జోరును పెంచేశాయి. విస్తృతంగా తిరుపతి లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నాయి. తిరుపతి పార్లమెంట్ స్థానం చాలా కీలకమైనది కావడంతో.. పార్టీలన్నీ గెలుపు దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇప్పటివరకు పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించగా… పార్టీ అధినేతలు ఇప్పటివరకు ప్రచారంలోకి దిగలేదు. త్వరలో ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచార బరిలోకి దిగనున్నారు. ఈ నెల 8 నుంచి రెండు రోజుల పాటు చంద్రబాబు ప్రచారం నిర్వహించనుడగా.. ఈ నెల 14న జగన్ ప్రచారం నిర్వహించనున్నారు. అధినేతలిద్దరూ ప్రచారంలోకి దిగడంతో రాజకీయ వేడి మరింత పెరిగేలా ఉంది.

Tags:    

Similar News