ఎన్నిలకు సిద్ధంగా ఉండండి : చంద్రబాబు

దిశ, ఏపీ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు, నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారం టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను వైసీపీ ప్రభుత్వం భగ్నం చేస్తోందన్నారు. కట్టిన ఇళ్లన్నీ పేదలకు అప్పజెప్పకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఏం నేరం చేశారని ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని నిలదీశారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరిగితే గెలవలేమనేదే వైసీపీ […]

Update: 2020-11-24 09:49 GMT

దిశ, ఏపీ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు, నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారం టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను వైసీపీ ప్రభుత్వం భగ్నం చేస్తోందన్నారు. కట్టిన ఇళ్లన్నీ పేదలకు అప్పజెప్పకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఏం నేరం చేశారని ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని నిలదీశారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరిగితే గెలవలేమనేదే వైసీపీ భయమని చెప్పారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. వైసీపీని వదిలించుకోకపోతే రాష్ట్రానికి పట్టిన పీడ వీడదని చంద్రబాబు వ్యక్తం చేశారు.

Tags:    

Similar News