అమృతను సస్పెండ్ చేయండి.. చాడ వెంకట్ రెడ్డి డిమాండ్

దిశ, మహబూబాబాద్: కంపా నిధులు దుర్వినియోగం చేసిన గూడూరు అటవీశాఖ రేంజ్ అధికారిణి అమృతను వెంటనే సస్పెండ్ చేసి, నిధులు రికవరీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ, గంగారం, మహబూబాబాద్, బయ్యారం మండలాల్లో పోడు పరిరక్షణ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ అభివృద్ధికి ఉపయోగించాల్సిన నిధులల్లో పదిహేను శాతం పర్సంటేజ్ లు తీసుకుంటే ఎలా అభివృద్ధి జరుగుతుందన్నారు. సెక్షన్ […]

Update: 2021-08-06 07:06 GMT

దిశ, మహబూబాబాద్: కంపా నిధులు దుర్వినియోగం చేసిన గూడూరు అటవీశాఖ రేంజ్ అధికారిణి అమృతను వెంటనే సస్పెండ్ చేసి, నిధులు రికవరీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ, గంగారం, మహబూబాబాద్, బయ్యారం మండలాల్లో పోడు పరిరక్షణ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ అభివృద్ధికి ఉపయోగించాల్సిన నిధులల్లో పదిహేను శాతం పర్సంటేజ్ లు తీసుకుంటే ఎలా అభివృద్ధి జరుగుతుందన్నారు. సెక్షన్ అధికారులకు నిధుల కోత విధించడంతో ఫారెస్ట్ పనులకు వెళ్లిన రైతు కూలీలకు డబ్భులు కూడా తక్కువ చెల్లించారు అని ఆరోపించారు. రేంజ్ అధికారిపై చర్యలు తీసుకోవడంలో కాలయాపన చేస్తే ఉద్యమం ఉదృతం చేస్తామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ పోడు రైతులపై వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు. దళిత, గిరిజన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. గూడూరు మండలం లైన్ తండా, గంగారం మండలం మడగూడెం గ్రామాల్లో రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోడు రైతులందరికీ పట్టాలివ్వాలని అన్నారు. హరితహారం కార్యక్రమం పేరుతో రైతులు భూములు లాగుక్కోవడం సిగ్గు చేటు అని అన్నారు. పోడు రైతులందరికీ రైతు భీమా, రైతు బంధు పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్యాక్రాంతమైన భూములపై పోరాటం చేస్తున్నామని తెలిపారు. పోడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. అటవీ హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని, రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల పోడు భూమాలకు గాను 3 లక్షల ఎకరాల మాత్రమే హక్కు పత్రాలు మంజూరు చేశారని మండిపడ్డారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని రైతులు తిరుగుబాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి విజయ్ సారధి పాల్గొన్నారు.

Tags:    

Similar News