మరో రెండు వారాలు లాక్‌డౌన్ ఖాయమేనా?

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా మరో రెండు వారాలు లాక్‌డౌన్ కొనసాగే అవకాశం కనిపిస్తున్నది. నేడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మోడీతో దాదాపుగా అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ కనీసం మరో రెండు వారాలు కొనసాగించాలనే అభ్యర్థించాయి. అయితే, తుది నిర్ణయం ఇప్పుడు కేంద్రమే తీసుకోవాల్సి ఉన్నది. త్వరలోనే ప్రధాని మోడీ ఈ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అయితే, దాదాపు అన్ని రాష్ట్రాలు ఒకే అభిప్రాయాన్ని వెల్లడించడంతో.. కేంద్రం కూడా లాక్‌డౌన్‌ పొడిగించేందుకే మొగ్గుచూపనున్నట్టు తెలుస్తున్నది. నేడు జరిగిన కాన్ఫరెన్స్ కంటే […]

Update: 2020-04-11 02:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా మరో రెండు వారాలు లాక్‌డౌన్ కొనసాగే అవకాశం కనిపిస్తున్నది. నేడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మోడీతో దాదాపుగా అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ కనీసం మరో రెండు వారాలు కొనసాగించాలనే అభ్యర్థించాయి. అయితే, తుది నిర్ణయం ఇప్పుడు కేంద్రమే తీసుకోవాల్సి ఉన్నది. త్వరలోనే ప్రధాని మోడీ ఈ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అయితే, దాదాపు అన్ని రాష్ట్రాలు ఒకే అభిప్రాయాన్ని వెల్లడించడంతో.. కేంద్రం కూడా లాక్‌డౌన్‌ పొడిగించేందుకే మొగ్గుచూపనున్నట్టు తెలుస్తున్నది. నేడు జరిగిన కాన్ఫరెన్స్ కంటే ముందు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్‌లతో సమావేశంలోనూ ఇవే అభ్యర్థనలు వచ్చాయి. మోడీ ఏర్పాటు చేసిన 11 మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీకి నిపుణులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే అభిప్రాయాన్ని తెలిపాయి.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ పొడిగించాలనే అభిప్రాయాన్నే ప్రధాని ముందుంచాయి. కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీల ముఖ్యమంత్రులు, జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్.. లాక్‌డౌన్ పొడిగించాలనే ప్రధానిని కోరారు. కాగా, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్.. పాక్షిక లాక్‌డౌన్‌ అమలు చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాలు ఆ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ పొడిగింపునకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

Tags: lockdown, extension, favour, modi, likely, announcement

Tags:    

Similar News