స్కానియా బస్ కుంభకోణం : నాపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలే
దిశ,వెబ్‌డెస్క్:తనపై నేషనల్ మీడియా అసత్యప్రచారం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి. 100 ట్రక్కులు, 77,300 డాలర్లు ముడుపులు స్పీడన్‌కి చెందిన బస్సుల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో స్కానియా ఒకటి. స్కానియా కంపెనీ 2013 నుంచి 2016 భారత్ లో తన కార్యకలాపాలు నిర్వహించింది. అదే సమయంలో భారత్ లోని 7 రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ లను దక్కించుకునేందుకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు, మంత్రులకు భారీ ఎత్తున […]
దిశ,వెబ్‌డెస్క్:తనపై నేషనల్ మీడియా అసత్యప్రచారం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి.
100 ట్రక్కులు, 77,300 డాలర్లు ముడుపులు
స్పీడన్‌కి చెందిన బస్సుల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో స్కానియా ఒకటి. స్కానియా కంపెనీ 2013 నుంచి 2016 భారత్ లో తన కార్యకలాపాలు నిర్వహించింది. అదే సమయంలో భారత్ లోని 7 రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ లను దక్కించుకునేందుకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు, మంత్రులకు భారీ ఎత్తున ముడుపులు చెల్లించిందంటూ స్వీడిష్ కి చెందిన ఎస్వీటీ ఛానల్ తో పాటు జర్మన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ జెడ్‌డీఎఫ్ లు సంచలన విషయాల్ని వెలుగులోకి తెచ్చాయి. అంతేకాదు మొత్తం 77,300 డాలర్ల వరకు ముడుపులు చెల్లించగా, ఫేక్ డాక్యుమెంట్లతో దాదాపు 100 ట్రక్‌లను రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో నడిచే మైనింగ్ కంపెనీలకు వాటిని విక్రయించినట్లుగా అంతర్గత విచారణలో తేలినట్లు తెలుస్తోంది.
అందుకే మూసేశాం
ఎస్వీటీ ఛానల్ తో పాటు జర్మన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ జెడ్‌డీఎఫ్ లు చేపట్టిన స్కానియా కంపెనీ అంతర్గత విచారణపై ఆ సంస్థ సీఈఓ స్పందించారు. 2013-2017 మధ్య తమ సంస్థల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించామన్నారు. అప్పటినుంచి భారత్‌లో బస్సుల అమ్మకాలను నిలిపివేశామని.. అక్కడి తమ ఫ్యాక్టరీని కూడా మూసివేశామని చెప్పారు.
ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు
స్వీడిష్ మీడియా నివేదిక ఆధారంగా నేషనల్ మీడియా రాయిటర్స్ కథనాన్ని ప్రచురించింది. స్కానియా సంస్థ నితిన్ గడ్కరి కుమార్తె వివాహానికి బస్సుల్ని పంపిణీ చేసిందని పేర్కొంది. అయితే స్కానియా కంపెనీ స్కాంలో తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరి. తన తరుపున యూనియన్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ మరియు ఎంఎస్ఎంఇ కార్యాలయం ద్వారా ప్రకటన విడుదల చేయించారు. 2016 నితిన్ గడ్కరీ కుమార్తె వివాహానికి స్కానియా సంస్థ తన బస్సుల్ని పంపిణీ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో వాస్తవం లేదు. తన కుమార్తె వివాహానికి ఏ సంస్థ లగ్జరీ బస్సుల్ని ఏర్పాటు చేయలని ప్రకటనలో పేర్కొంది.