కొడుకు సెంట్రల్ మినిస్టర్.. తల్లిదండ్రులు కూలి పనికి..!

దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా తల్లిదండ్రులు ఉన్నత స్థాయిలో ఉంటే వారి పిల్లలు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వారు అడిగినవన్నీ వెంటనే తెచ్చిస్తుంటారు. కానీ, కొడుకులు ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రులు మాత్రం వారి గతాన్ని, తాము ఏం చేస్తే పిల్లలు ఈ స్థాయికి వచ్చారనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోరు. తాజాగా ఓ కేంద్రమంత్రి తల్లిదండ్రులు అదే విషయాన్ని మరోసారి స్పష్టంచేశారు. కొడుకు ఢిల్లీలో చక్రం తిప్పే స్థాయికి ఎదిగినా వారు మాత్రం ఇన్నిరోజులు […]

Update: 2021-07-20 03:00 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా తల్లిదండ్రులు ఉన్నత స్థాయిలో ఉంటే వారి పిల్లలు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వారు అడిగినవన్నీ వెంటనే తెచ్చిస్తుంటారు. కానీ, కొడుకులు ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రులు మాత్రం వారి గతాన్ని, తాము ఏం చేస్తే పిల్లలు ఈ స్థాయికి వచ్చారనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోరు. తాజాగా ఓ కేంద్రమంత్రి తల్లిదండ్రులు అదే విషయాన్ని మరోసారి స్పష్టంచేశారు. కొడుకు ఢిల్లీలో చక్రం తిప్పే స్థాయికి ఎదిగినా వారు మాత్రం ఇన్నిరోజులు ఎలా జీవనం సాగించారో ఇకమీదట కూడా అదే చేయాలని నిర్ణయించుకున్నారు. కొడుకు నుంచి పిలుపువచ్చినా కాదని కూలీ పనులకు వెళ్తున్నారు. ఈ అరుదైన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. ఇటీవల ప్రధాని మోడీ కేబినెట్ విస్తరణ సందర్భంగా బీజేపీ నేత ఎల్. మురుగన్‌కు కేంద్ర సహాయ మంత్రి హోదా దక్కింది. ఆయనది తమిళనాడులోని నామక్కల్ జిల్లా పరమత్తి సమీపంలోని కోనూరు గ్రామం. తండ్రి లోకనాథన్ (65), తల్లి వరదమ్మాల్ (60). వీరు మొదటి నుంచి వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు కుమారులు మురుగన్, రామస్వామి. తమ రెక్కల కష్టంతోనే వీరిద్దని పెంచి పెద్ద చేసి చదివించారు. చదువు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి కనబరిచే మురుగన్ న్యాయవిద్య, ఎంఎల్, పీహెచ్డీ పూర్తిచేసి బీజేపీలో చేరారు.

ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. ఇటీవల కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు. ఈయన సతీమణి మురుగన్ కలైయరసి చెన్నైలో పీడియాట్రిషన్ వైద్యురాలిగా పనిచేస్తోంది. కొడుకు కేంద్రమంత్రి అయ్యాక.. తనతో కలిసి ఉండాలని పిలిచాడని.. కానీ సొంత కష్టంతోనే బతకాలని నిర్ణయించుకుని కూలీ పనులకు వెళ్తున్నట్లు లోకనాథన్ దంపతులు సింపుల్‌గా జవాబిచ్చారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రమంత్రి తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లడం ఎంటనీ కొందరు ప్రశ్నిస్తుంటే.. మరికొందరు మాత్రం ఆ వృద్ధ దంపతుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

Tags:    

Similar News