2021 తొలి త్రైమాసికంలో కరోనా వ్యాక్సిన్..
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే భారత్‌లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయన్నారు. కరోనా వ్యాక్సిన్ల కోసం ఒక వెబ్‌సైట్ రూపొందించామని, ఈ వెబ్‌సైట్‌లోకి వెళితే ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న వ్యాక్సిన్ల సమాచారం తెలుసుకోవచ్చని కేంద్రమంత్రి వెల్లడించారు.
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే భారత్‌లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఆయన చెప్పారు.
ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయన్నారు. కరోనా వ్యాక్సిన్ల కోసం ఒక వెబ్‌సైట్ రూపొందించామని, ఈ వెబ్‌సైట్‌లోకి వెళితే ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న వ్యాక్సిన్ల సమాచారం తెలుసుకోవచ్చని కేంద్రమంత్రి వెల్లడించారు.