వెనక్కి తగ్గేది లేదు..
దిశ, ఢిల్లీ : సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సీఏఏ)పై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర న్యాయ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మరోసారి స్పష్టం చేశారు.ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంచరించకున్నాయి.అవసరమైతే దేశ ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు,సందేహాలను నివృత్తి చేసేందుకు కృషి చేస్తామని, సీఏఏ చట్టంపై అవగాహన కల్పించి అందరూ ఒప్పుకునేలా చర్యలు చేపడుతామని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు కావాలనే తమ స్వార్థ రాజకీయం కోసం దేశ ప్రజలను రెచ్చగొడుతున్నారని కేంద్రమంత్రి […]
దిశ, ఢిల్లీ :
సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సీఏఏ)పై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర న్యాయ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మరోసారి స్పష్టం చేశారు.ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంచరించకున్నాయి.అవసరమైతే దేశ ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు,సందేహాలను నివృత్తి చేసేందుకు కృషి చేస్తామని, సీఏఏ చట్టంపై అవగాహన కల్పించి అందరూ ఒప్పుకునేలా చర్యలు చేపడుతామని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు కావాలనే తమ స్వార్థ రాజకీయం కోసం దేశ ప్రజలను రెచ్చగొడుతున్నారని కేంద్రమంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.కాగా, ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోగా ఇప్పటివరకు 34మంది చనిపోయారు.