'రైతులను కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలి'
దిశ, న్యూస్‌బ్యూరో : రైతులకు, ఉపాధి కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆర్.సీ కుంతియా డిమాండ్ చేశారు. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19 కారణంగా దేశ ప్రజల్లో భయాందోళన నెలకొన్నదన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహకారం అందించాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చినట్లు తెలిపారు. లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థపై చాలా భారం పడనుందని, ఈ సమస్యను నుంచి గట్టేక్కేందుకు […]
దిశ, న్యూస్‌బ్యూరో : రైతులకు, ఉపాధి కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆర్.సీ కుంతియా డిమాండ్ చేశారు. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19 కారణంగా దేశ ప్రజల్లో భయాందోళన నెలకొన్నదన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహకారం అందించాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చినట్లు తెలిపారు. లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థపై చాలా భారం పడనుందని, ఈ సమస్యను నుంచి గట్టేక్కేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతులకు, ఉపాధి కూలీలకు, రోజువారీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కింద రూ.7500 వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు.
Tags : Cenral Govt, Financial assistance, AICC, Kuntia, Sonia Gandhi