ట్విట్టర్‌కు కేంద్రం నోటీసులు

దిశ, వెబ్‌డెస్క్: ట్విట్టర్ యాజమాన్యానికి తాజాగా భారత ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను హ్యాకర్లు హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ప్రపంచ కుబేరులతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖాతా సైతం ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన ప్రముఖులవి ఎవరివైనా ట్విట్టర్ ఖాతాలు సైబర్ దాడులకు గురయ్యాయో వివరాలు తెలపాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నది. సైబర్ సెక్యూరిటీ విభాగం ద్వారా ఈ నోటీసులను ట్విట్టర్ […]

Update: 2020-07-18 04:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ట్విట్టర్ యాజమాన్యానికి తాజాగా భారత ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను హ్యాకర్లు హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ప్రపంచ కుబేరులతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖాతా సైతం ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన ప్రముఖులవి ఎవరివైనా ట్విట్టర్ ఖాతాలు సైబర్ దాడులకు గురయ్యాయో వివరాలు తెలపాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నది. సైబర్ సెక్యూరిటీ విభాగం ద్వారా ఈ నోటీసులను ట్విట్టర్ కంపెనీకి పంపించినట్లు కేంద్రం వెల్లడించింది.

Tags:    

Similar News