ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్‌గా తరుణ బజాజ్!

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్‌గా ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న తరుణ్ బజాజ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అతాను చక్రవర్తి పదవీ విరమణ నేపథ్యంలో మే 5 నుంచి తరుణ్ బజాజ్ బాధ్యతలు అమల్లోకి వచ్చినట్టు ఆర్‌బీఐ తెలిపింది. అతాను చక్రవర్తి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేసిన తర్వాత, మే 1న ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా తరుణ్ బజాజ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని […]

Update: 2020-05-06 01:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్‌గా ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న తరుణ్ బజాజ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అతాను చక్రవర్తి పదవీ విరమణ నేపథ్యంలో మే 5 నుంచి తరుణ్ బజాజ్ బాధ్యతలు అమల్లోకి వచ్చినట్టు ఆర్‌బీఐ తెలిపింది. అతాను చక్రవర్తి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేసిన తర్వాత, మే 1న ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా తరుణ్ బజాజ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టడానికి ముందు ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు.

1988 బ్యాచ్ హర్యానా కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి తరుణ్ బజాజ్‌ 2015లో ప్రధానమంత్రి కార్యాలయంలో చేరడానికి ముందు ఆర్థిక వ్యవహారాల విభాగంలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. మల్టీలిటరల్ ఫండింగ్ ఏజెన్సీ విభాగంలో జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అక్కడ బీమా విభాగాలను చూసుకున్నారు.

Tags : Tarun Bajaj, Economic Affairs Secretary, Ministry Of Finance, Central Board Of Reserve Bank Of India, Atanu Chakraborty Retires

Tags:    

Similar News