దేశంలో కొత్త వైరస్ లేదు : కేంద్రం

న్యూఢిల్లీ : యూకేలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త రకం కరోనా వైరస్ ఇప్పటివరకు దేశంలో ఎవరికీ సోకలేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. రూపాంతరం చెందిన కరోనా వైరస్ గతంలో కంటే 70శాతం వేగం వ్యాప్తి చెందుతుందని తేలడంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. యూకేలో ఇన్‌ఫెక్షన్ రేటు తీవ్రంగా ఉంది. కొత్తరకం కరోనా వైరస్‌పై ఇప్పటికే ఉత్పత్తి చేసిన, చేస్తున్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా? లేదా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నీతి […]

Update: 2020-12-22 08:22 GMT

న్యూఢిల్లీ : యూకేలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త రకం కరోనా వైరస్ ఇప్పటివరకు దేశంలో ఎవరికీ సోకలేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. రూపాంతరం చెందిన కరోనా వైరస్ గతంలో కంటే 70శాతం వేగం వ్యాప్తి చెందుతుందని తేలడంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. యూకేలో ఇన్‌ఫెక్షన్ రేటు తీవ్రంగా ఉంది. కొత్తరకం కరోనా వైరస్‌పై ఇప్పటికే ఉత్పత్తి చేసిన, చేస్తున్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా? లేదా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ ప్రస్తుతానికైతే ఈ ప్రభావం స్వదేశం, విదేశాల్లో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు.

చాలా దేశాల్లో వ్యాపించింది : సౌమ్య స్వామినాథన్

ఇప్పటికే చాలా దేశాల్లో రూపాంతరం చెందిన కరోనా వైరస్ (బీ.1.1.7) వ్యాప్తి చెందిందని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. వైరస్ జన్యుమార్పిడిని పరిశీలిస్తున్న దేశాల్లో యూకే ఒకటని, సరైన సమయంలో వైరస్ ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. చాలా దేశాలు ఒక్కసారి డేటాను పరిశీలించుకోవాలని, ఇప్పటికే కొత్తరకం వైరస్, అలాంటి లక్షణాలు ఉన్న మహమ్మారి వ్యాప్తి ప్రారంభమై ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కొత్తరకం వైరస్ 70శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని తేలిందని, అయితే అప్పుడే ఒక నిర్ధారణకు రావడం తొందరపాటు చర్య అవుతుందని సౌమ్య స్వామినాథన్ చెప్పారు.

Tags:    

Similar News