రేషన్ షాపులో నిర్మలా సీతారామన్.. జగన్ ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్..?

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీలోని విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలో పర్యటిస్తున్నారు. ఆదివారం పర్యటనలో భాగంగా తాళ్లపాలెంలో ఉన్న రేషన్ షాపులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రేషన్ షాపుల్లో ఉచిత బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీపై ఆరా తీశారు. నేరుగా ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని కేంద్రం పేరుతోనే ఇవ్వాలని నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని స్పష్టంచేశారు. […]

Update: 2021-08-08 04:53 GMT

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీలోని విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలో పర్యటిస్తున్నారు. ఆదివారం పర్యటనలో భాగంగా తాళ్లపాలెంలో ఉన్న రేషన్ షాపులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రేషన్ షాపుల్లో ఉచిత బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీపై ఆరా తీశారు. నేరుగా ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని కేంద్రం పేరుతోనే ఇవ్వాలని నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని స్పష్టంచేశారు. రేషన్ డిపోల్లో ఎవరికి నచ్చిన ఫొటోలు వారు పెడితే కుదరదని ఆమె గట్టిగా చెప్పారు. ప్రతి రేషన్ డిపోలోనూ ప్రధాన మంత్రి మోడీ ఫొటో ఉండాలని కేంద్రమంత్రి పౌర సరఫరాల అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఫొటోలను వెంటనే తీసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News