వేతనాల్లో 30శాతం కోత విధించుకున్న కేంద్ర ఎన్నికల కమిషనర్లు

న్యూఢిల్లీ: కొవిడ్ 19పై పోరుకు కేంద్ర ఎన్నికల కమిషనర్లు తమ వంతు ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయించుకున్నారు. తమ బేసిక్ సాలరీలో 30శాతం స్వచ్ఛందంగా కోత విధించుకున్నారు. ఏప్రిల్ నుంచి ఏడాది పాటు తమ వేతనాల్లో కోత విధించుకునేందుకు వారు నిర్ణయించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్లు అశోక్ లవాసా, సుశీల్ చంద్రలు తమ వేతనాల్లో ఈ కోత విధించుకోబోతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భారత్ సహా ప్రపంచదేశాలన్నీ మహమ్మారి కొవిడ్ 19 […]

Update: 2020-04-13 04:07 GMT

న్యూఢిల్లీ: కొవిడ్ 19పై పోరుకు కేంద్ర ఎన్నికల కమిషనర్లు తమ వంతు ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయించుకున్నారు. తమ బేసిక్ సాలరీలో 30శాతం స్వచ్ఛందంగా కోత విధించుకున్నారు. ఏప్రిల్ నుంచి ఏడాది పాటు తమ వేతనాల్లో కోత విధించుకునేందుకు వారు నిర్ణయించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్లు అశోక్ లవాసా, సుశీల్ చంద్రలు తమ వేతనాల్లో ఈ కోత విధించుకోబోతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భారత్ సహా ప్రపంచదేశాలన్నీ మహమ్మారి కొవిడ్ 19 కట్టడి కోసం పోరాడుతున్నాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు సర్కారు కఠిన అమలు చేస్తూ.. ప్రజల ఆరోగ్యాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వాలు, పౌర సమాజానికి ఈ బృహత్తర కార్యంలో వనరులు అవసరమవుతాయని, అందుకే తమ వంతుగా ఈ సాయం అందించనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషనర్లు పేర్కొన్నారు.

tags: covid fund, cec, election commissioners, sunil arora, donation, salary, 30 percent reduction

Tags:    

Similar News