NRIలకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం!

దిశ, వెబ్‌డెస్క్ : విదేశాల్లోని ఎన్‌ఆర్ఐలు పోస్టల్ బ్యాలెట్ (ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్) ద్వారా ఓటింగ్ వేసే అవకాశాన్ని పరిశీలించాలని కేంద్రం ముందు ఎన్నికల సంఘం ప్రతిపాదన ఉంచింది. పార్లమెంటు ఆమోదం అవసరం లేదని, కేవలం ఎన్నికల నియమావళిలో కొన్ని నిబంధనలను సవరిస్తే చాలని న్యాయ శాఖకు తెలిపింది. ఈ నిర్ణయంతో వచ్చే ఏడాది అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో జరిగే ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు పాల్గొనే వీలు కలుగుతుందని పేర్కొంది. ఎన్ఆర్ఐలకు […]

Update: 2020-12-01 11:08 GMT

దిశ, వెబ్‌డెస్క్ : విదేశాల్లోని ఎన్‌ఆర్ఐలు పోస్టల్ బ్యాలెట్ (ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్) ద్వారా ఓటింగ్ వేసే అవకాశాన్ని పరిశీలించాలని కేంద్రం ముందు ఎన్నికల సంఘం ప్రతిపాదన ఉంచింది. పార్లమెంటు ఆమోదం అవసరం లేదని, కేవలం ఎన్నికల నియమావళిలో కొన్ని నిబంధనలను సవరిస్తే చాలని న్యాయ శాఖకు తెలిపింది.

ఈ నిర్ణయంతో వచ్చే ఏడాది అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో జరిగే ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు పాల్గొనే వీలు కలుగుతుందని పేర్కొంది. ఎన్ఆర్ఐలకు పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించిన బిల్లు కాలం చెల్లిపోయి ఏడాది గడిచిన తర్వాత ఎన్నికల సంఘం ప్రతిపాదించడం గమనార్హం.

Tags:    

Similar News